D News: September 2, 2026

గాదరి కిశోర్‌ కుమార్‌ ఫైర్‌.. ‘రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ మాల వేసుకుని తిరగాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు!

తుంగతుర్తి: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్‌కుమార్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కిశోర్‌కుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు

రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని కిశోర్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్‌రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని విమర్శించారు.

కేసీఆర్‌ గురించి మాట్లాడే ముందు తన స్థాయి తెలుసుకోవాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.

420 హామీలపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కిశోర్‌కుమార్‌ ఆరోపించారు. అయితే వాటిలో ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

ప్రభుత్వ పాలనపై వ్యంగ్యంగా స్పందిస్తూ రాష్ట్రంలో ‘ఒక జీఎం మేస్త్రీ.. కింద ఒక బీఎం మేస్త్రీ’ పాలన సాగుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇసుక మాఫియాపై సవాల్‌

తన పదేళ్ల ఎమ్మెల్యే పదవీకాలంలో రూ.10 లక్షల ఇసుక మాఫియా చేసినట్లు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కిశోర్‌కుమార్‌ సవాల్‌ చేశారు.

సాగర్‌ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడం లేదని ఆరోపించారు.

‘కేసీఆర్‌ మాల’ వేసుకుని తిరగాలి

వెయ్యి రోజుల పాలనపై రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న సభల్లో తరచూ కేసీఆర్‌ పేరును ప్రస్తావిస్తున్నారని కిశోర్‌కుమార్‌ అన్నారు.

అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాలల మాదిరిగా ‘కేసీఆర్‌ మాల’ వేసుకుని తిరగాలని రేవంత్‌రెడ్డిని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు-రేవంత్‌పై ఆరోపణలు

చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కారణంగానే సాగర్‌ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారని కిశోర్‌కుమార్‌ ఆరోపించారు.

తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేసి ఆంధ్ర రైతులకు మేలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు.

హామీలు అమలు చేయాలని డిమాండ్‌

రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడంపై కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని కిశోర్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ హామీలను ప్రస్తావిస్తూ నిరసనలో భాగంగా 420 మీటర్ల ఫ్లెక్సీ ప్రదర్శించారు. అలాగే కాంగ్రెస్‌ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు.

భారీగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్డీవో కార్యాలయం, అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి ప్రధాన కూడలి వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు సాగింది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana