
D News: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం జరిగిన ఉద్రిక్త పరిణామాలపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డితో పాటు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు BRS ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి.
BRS ఎమ్మెల్సీలపై SC/ST అట్రాసిటీ కేసులు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం వారిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఏ సెక్షన్ల కింద కేసులు?
ఇద్దరిపై BNS సెక్షన్ 352, 3(5)తో పాటు SC/ST (Prevention of Atrocities) Actలోని సెక్షన్లు 3(1)(r), 3(2)(va), 3(2)(vii) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేటీఆర్, హరీశ్‌రావుపైనా కేసులు
పోలీసు అధికారులపై దాడి చేసి దూషించారనే ఆరోపణలతో కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు BRS ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం. బాలస్వామి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
15 మంది BRS నేతలపై కేసు
కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, శంబీపూర్ రాజు, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సహా మొత్తం 15 మందిపై కేసులు నమోదైనట్లు సమాచారం.
ఆప్, బీజేపీ కార్యకర్తలపైనా కేసులు
అసెంబ్లీ సమావేశాల సమయంలో పెట్రోల్ పోసుకుని హంగామా చేశారనే ఆరోపణలతో ఆప్ కార్యకర్త హేమచంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణలతో బీజేపీ కార్యకర్త గణేశ్‌పై కూడా కేసు పెట్టారు.
