D Spiritual: Jan 31: ఇంటి ఆడబిడ్డలను ఆ ఇంటి మహాలక్ష్మిగా కొలుస్తారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంటి ఆడపిల్లకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఏ ఇంటిలో అయితే ఆడపిల్ల ఆనందంగా ఉంటుందో, ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివసిస్తున్నట్లేనని అంటారు. అందుకే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వివాహం చేసి అత్తవారింటికి పంపే ముందు కూడా గౌరవంగా బియ్యం పోసి సాగనంపడం మన సంప్రదాయంలో భాగం. అయితే అసలు ఎందుకు ఇలా ఓడి బియ్యం పోసి పంపుతారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది.

మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వాటిలో వివాహమైన స్త్రీలకు ఓడి బియ్యం పోయడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. ఇది నేటికీ గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా చాలా కుటుంబాలు పాటిస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా వివాహ సమయంలో, పుట్టింట్లో పెద్ద పండుగ జరిగినప్పుడు, కూతురు మరో బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, లేదా ఏ చిన్న శుభకార్యం జరిగినా సారె పెట్టి ఓడి బియ్యం పోసి పంపిస్తారు.

ఆడపిల్ల అంటే ఆ ఇంటి మహాలక్ష్మీ అని భావిస్తారు. అందుకే ఆమెకు వివాహం సమయంలోనే కాకుండా, తరువాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఓడి బియ్యం పోస్తుంటారు. ఇలా చేయడం ద్వారా తమ బిడ్డ అత్తింట్లో సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు.

ఈ ఓడి బియ్యం ఆచారం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటంటే — అల్లుడిని మహావిష్ణువులా భావించి, తమ కూతురిని రక్షించమని బియ్యం పోసి, కొత్త బట్టలు పెట్టి విన్నపం చేయడం. ఇది ఆడపిల్లకు ఇచ్చే గౌరవానికి ప్రతీక. అలాగే తమ బిడ్డ చల్లగా, సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఓడి బియ్యం పోసి ఆశీర్వదిస్తారు.

ఇంకా ఒక విశ్వాసం ప్రకారం, ఆడబిడ్డ తనకు పోసిన బియ్యంలో నుంచి ఐదు పిరికిళ్లు తీసుకుని పుట్టింటివారికి ఇస్తుంది. దీని వల్ల పుట్టింటికీ, అత్తింటికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.

పండితుల మాటల ప్రకారం, మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. వాటిలో ఏడవ చక్రాన్ని గౌరీ దేవిగా భావిస్తారు. ఈమె మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుందని చెబుతారు. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ పీఠంలో ఉన్న శక్తినే మహాలక్ష్మిగా భావిస్తారు. అందుకే వివాహం తర్వాత ఆడపిల్లకు బియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి శక్తికి బియ్యం సమర్పించినట్లేనని చెబుతారు.

అందుకే ప్రతి పుట్టింటి వారు తమ కూతురు అత్తింట్లో ఆనందంగా ఉండాలని, ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ఓడి బియ్యం పోసి, గౌరవంగా అత్తింటికి సాగనంపుతారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు — కుమార్తెపై ఉన్న ప్రేమకు, ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana