
DNews: Jan22: పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ధర్మం…ధైర్యం…సేవే తన మార్గమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కోటప్పకొండ పర్యటన తన రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ముందుగా పవన్ కళ్యాణ్ తన కారు పాదాల చెంత నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. తరువాత కోటప్ప కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద జమీందార్ రామకృష్ణ కొండలరావు, ఈఓ చంద్రశేఖర్ వేదపండితులు ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఆయన ఆలయం లోపలికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. తరువాత పూజారులు ఆయనను ఆశీర్వదించారు. పూజ తర్వాత పవన్ కళ్యాణ్ కోటప్ప కొండ నుండి కొత్తపాలెం వరకు నిర్మించిన కొత్త రహదారిని ప్రారంభించారు.
