D news: Aug 8: ఢిల్లీలో కుండపోత వర్షాలు.. స్తంభించిన జనజీవనం

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలో శుక్రవారం కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా నగరంలో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రధాన రహదారులు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆగస్టు తొలి వారంలో 2011 తర్వాత ఈ స్థాయిలో అధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ–బదర్‌పూర్ రహదారి భారీగా జలమయమైంది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో సుమారు నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. ఓఖ్లా మోర్, ఖాన్‌పూర్, సంగమ్ విహార్ ప్రాంతాల్లోనూ వరద నీరు చేరింది. నీటిలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీసేందుకు ఎయిర్‌ఫోర్స్ ట్రక్కులతో సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు ఐటీఓ, పటేల్ రోడ్, రోహ్‌తక్ రోడ్, ఢిల్లీ–జైపూర్ హైవే వంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఇళ్లు కూలి.. ఆసుపత్రుల్లోకి చేరిన వర్షపు నీరు

భారీ వర్షాల ధాటికి ఢిల్లీలో తొమ్మిది ఇళ్లు కూలిపోయినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. మరో 16 ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఒక ఇంటిపై చెట్టు కూలడంతో లోపల చిక్కుకున్న ముగ్గురు మహిళలను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

నోయిడాలో నీటితో నిండిన ఓ అండర్‌పాస్‌లో ఒక అంబులెన్స్ అరగంటకు పైగా చిక్కుకుపోయింది. మరోవైపు గురుగ్రామ్‌లోని సివిల్ హాస్పిటల్ బేస్‌మెంట్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

భారీ వర్షపాతం.. రెడ్ అలర్ట్ జారీ

శుక్రవారం ఉదయం వరకు సఫ్దర్‌జంగ్‌లో 59.2 మిల్లీమీటర్లు, లోధి రోడ్డులో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫరీదాబాద్‌లో ఏకంగా 119.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డు స్థాయికి చేరింది.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రోజంతా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, శనివారం నుంచి వర్ష తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana