D News: Oct 9: రైల్వేలో 590 పారా మెడికల్‌ పోస్టులు.. దరఖాస్తులకు మరో కొద్ది రోజులే గడువు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) వివిధ పారా మెడికల్‌ కేటగిరీల్లో ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీసు 05/2026 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 590 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 14 చివరి తేదీ కావడంతో అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 365 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు, 118 ఫార్మసిస్ట్‌ పోస్టులు, 43 ఇన్‌స్పెక్టర్‌ పోస్టులతో పాటు ఇతర పారా మెడికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు

సంబంధిత విభాగాన్ని బట్టి అభ్యర్థులు డిగ్రీ, డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం, బీఫార్మసీ, డీఫార్మసీ, రేడియోలాజికల్‌ టెక్నాలజీ వంటి కోర్సులను పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.

జీతభత్యాలు, ఎంపిక విధానం

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.21,700 నుంచి రూ.44,900 వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT), సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు గడువు

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 14వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత పోస్టుకు అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించడం మంచిది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana