
DNews: Dec 10: శంషాబాద్ విమానాశ్రయానికి ఇటీవల వరుసగా రెండు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ రాజేష్ బుధవారం ఆయన తెలిపిన ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు 20కి పైగా నకిలీ బెదిరింపు కాల్స్ మరియు మెసేజ్‌లు విమానాశ్రయానికి వచ్చాయి. ఈ నకిలీ కాల్స్, మెయిల్స్‌పై దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు. సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు వివరించారు. ఇప్పటికే కొంతమంది నకిలీ కాల్స్ చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ కాల్స్ చేశామని వారు విచారణలో వెల్లడించినట్లు చెప్పారు. కొందరు భయపెట్టడం, ఆటపట్టించడం కోసం బెదిరింపు కాల్స్ మరియు మెయిల్స్ చేస్తున్నారని ఆయన వివరించారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని కాల్స్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చినవేనని చెప్పారు. ఉగ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తులు ఈ బెదిరింపు కాల్స్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని డీసీపీ రాజేష్ స్పష్టం చేశారు. బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని.
