
DSports 16Mar 2026:పాకిస్థాన్ విజయానికి చివరి 2 బంతుల్లో 12 పరుగులు కావాలి. క్రీజులో కెప్టెన్ షాహీన్ అఫ్రిది ఉన్నారు.బంగ్లా స్పిన్నర్ రిషాద్ హోసైన్ వేసిన బంతి లెగ్ సైడ్ వెళ్లడంతో అంపైర్ కుమార్ ధర్మసేన దాన్ని ‘వైడ్‘గా ప్రకటించారు.అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ (LBW) కోసం రివ్యూ కోరారు.థర్డ్ అంపైర్ పరిశీలనలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు అల్ట్రా ఎడ్జ్ లో స్పష్టమైంది. దీంతో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ‘వైడ్’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, దాన్ని ‘డాట్ బాల్‘గా ప్రకటించారు.
- నిబంధనల ఉల్లంఘన: అంపైర్ నిర్ణయం తీసుకున్న 15 సెకన్లలోపు రివ్యూ కోరాలి. కానీ బంగ్లాదేశ్ నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రివ్యూ అడిగిందని పాక్ ఆరోపిస్తోంది.
- బిగ్ స్క్రీన్ రిప్లే: స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై రిప్లే చూసిన తర్వాతే బంగ్లాదేశ్ రివ్యూకు వెళ్లిందని, ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని పాక్ వాదిస్తోంది.
- షాహీన్ అసహనం: ఈ రివ్యూ సమయంలో షాహీన్ అఫ్రిది అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. చివరి బంతికి ఆయన స్టంపౌట్ అవ్వడంతో బంగ్లాదేశ్ 11 పరుగులతో గెలిచి, సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
