
D Educt: Sept 4: ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఛైర్మన్‌గా, సమగ్రశిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రతినిధులు, ఎన్జీవో ప్రతినిధులకు కూడా కమిటీలో చోటు కల్పించారు.
