
DNews: Dec 10: గోపాలపేట మండలంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే ఎన్నికల సామగ్రితో కూడిన సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సమయానికి చేరుకోవాలని అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్, అధికారులు మరియు ఎం.పి.డి.ఓ. ఆయేషా అంజుమ్ పాల్గొన్నారు.
