
DNews: Mar23: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శెట్టిబలిజాల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులైన డొమ్మేటి వెంకటరెడ్డికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందే ఆయన చేసిన సాంఘిక సేవను, శెట్టిబలిజాల అభ్యున్నతికి చేసిన గొప్ప ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. సాధికారత విద్యతోనే వస్తుందనే సత్యాన్ని నమ్మినందుకు, ఆ రోజుల్లో విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పినందుకు ఆయనను కొనియాడారు. ఈరోజు డొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం
సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు, శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారు. ‘చదువుతోనే సాధికారత’ అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆరోజుల్లోనే చాటి చెప్పారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, తన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చిన ధీశాలి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఈ జయంతి వేడుకల వేళ ఆయనను స్మరించుకుని, స్ఫూర్తి పొందుదాం అని X లో ట్వీట్ చేశారు.
