DNews: Dec5: విద్యుత్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు చేసిన ప్రకటన ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఆమె అన్నారు. సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో సంకీర్ణ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై వేల కోట్ల భారం మోపిందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.

“విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు తీవ్ర హాస్యాస్పదం. బిల్లుల మోతతో ఒకపక్క వాతలు పెడుతున్నారు. సర్దుపోటుతో గుండెపోటు తెప్పిస్తున్నారు. షాకుల మీద షాకులు ఇస్తూ ఇల్లు గుల్ల చేస్తున్నారు. మరోపక్క ఛార్జీలు పెంచమని తేనె పూసిన కత్తి మాటలు చెప్తున్నారు. 

17 నెలల సంకీర్ణ పాలనలో ప్రజలపై విధించిన అధిక ఛార్జీల భారం రూ. 15,485 కోట్లు. ట్రూ అప్ రాబోయే రెండేళ్ల పాటు ప్రజలపై భారీ భారం. యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేస్తున్నప్పటికీ… ఛార్జీలు పెంచబోనని, తన మాటకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు చెప్పడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్.

చంద్రబాబు తత్వం తన మాట మీద నిలబడటం అయితే, ప్రజలపై ఛార్జీల భారం మోపకుండా ఉండటంలో ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, వెంటనే రూ. 15,485 కోట్ల సర్దుబాటు భారాన్ని రద్దు చేయండి. ట్రూ అప్ పేరుతో ఇప్పటివరకు వసూలు చేసిన 3 వేల కోట్లను ట్రూ డౌన్ రూపంలో ప్రజలకు తిరిగి ఇవ్వండి. “వెంటనే అమలు చేయండి ప్రస్తుత ఛార్జీలను 30 శాతం తగ్గించాలని షర్మిల డిమాండ్ చేశారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana