
D News: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్లు, టాస్క్‌లతో హౌస్‌లో హీట్ పెరుగుతుండగా.. తాజాగా విడుదలైన 11వ రోజు రెండో ప్రోమోలో షాకింగ్ ట్విస్ట్ కనిపించింది. కంటెస్టెంట్ షాలినీ దామేరను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించినట్లు ప్రోమోలో చూపించారు.
భయానక వాతావరణంలో గ్రిమ్ రీపర్స్ ఎంట్రీ
ప్రోమోలో భాగంగా గార్డెన్ ఏరియాను పుర్రెలు, ఎముకలు, సమాధులు, విషసర్పాల నమూనాలతో భయానకంగా తీర్చిదిద్దారు. నల్లటి దుస్తులు, మాస్క్‌లు ధరించిన ‘గ్రిమ్ రీపర్స్’ చేతుల్లో కొడవళ్లతో హౌస్‌లోకి ప్రవేశించారు. దీంతో కంటెస్టెంట్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఆ తర్వాత ఒక బాక్స్‌ను తెరవాలని బిగ్ బాస్ ఆదేశించారు. షాలినీ ముందుకు వెళ్లి సమాధి తరహాలో ఉన్న బాక్స్‌ను తాకింది. దీంతో మొదటగా బాక్స్‌ను తాకిన వ్యక్తిని గ్రిమ్ రీపర్స్ తీసుకెళ్తారని బిగ్ బాస్ ప్రకటించినట్లు ప్రోమోలో కనిపించింది.
షాలినీ ఎలిమినేషనా.. సీక్రెట్ రూమ్ ట్విస్టా?
బిగ్ బాస్ ఆదేశాలతో గ్రిమ్ రీపర్స్ షాలినీని మెయిన్ డోర్ గుండా బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో మిగిలిన హౌస్‌మేట్స్ షాక్‌కు గురయ్యారు. “వాట్ ది హెల్?” అంటూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
అయితే షాలినీ నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? లేక సీక్రెట్ రూమ్ లేదా మరేదైనా టాస్క్‌లో భాగంగా ఆమెను బయటకు పంపించారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ట్విస్ట్‌పై పూర్తి స్పష్టత రావాలంటే తాజా ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
