
DSports 3oApr 2026:ముంబై/జైపూర్: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ (Vaping) వాడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీసీసీఐ దీనిని క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించింది.
- నిషేధిత వస్తువు: భారత ప్రభుత్వ చట్టం ప్రకారం దేశంలో ఈ-సిగరెట్ల తయారీ, విక్రయం మరియు వినియోగం పూర్తిగా నిషేధం.
- క్రమశిక్షణా చర్యలు: ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ పరాగ్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బీసీసీఐ ఇప్పటికే పరాగ్ నుంచి వివరణ కోరినట్లు సమాచారం.
- శిక్షలు ఏమిటి?: భారత చట్టాల ప్రకారం మొదటిసారి ఈ తప్పు చేస్తే రూ. 1 లక్ష వరకు జరిమానా లేదా ఒక ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. క్రీడా పరంగా చూస్తే, అతడిపై కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధం (Ban) విధించే ఛాన్స్ ఉంది.
