
DSports 30Jan 2026:మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో అసలు సిసలైన సమరం ఆసన్నమైంది. గురువారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్స్‌లో నెగ్గిన అర్యాన సబలెంక (బెలారస్), ఎలీనా రిబకినా (కజకిస్థాన్) తుది పోరుకు అర్హత సాధించారు. శనివారం (జనవరి 31) జరగనున్న ఫైనల్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం తలపడనున్నారు.
- తొలి సెమీఫైనల్‌లో టాప్ సీడ్ అర్యాన సబలెంక తన జోరును కొనసాగించింది. ఉక్రెయిన్ స్టార్ ఎలీనా స్విటోలినాపై 6-2, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. కేవలం గంటా 16 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంక పవర్‌ఫుల్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
- మెల్‌బోర్న్ పార్క్‌లో సబలెంకకు ఇది వరుసగా నాలుగో ఫైనల్. ఈ క్రమంలో ఆమె మార్టినా హింగిస్, ఎవోన్ గూలాగాంగ్ వంటి దిగ్గజాల సరసన నిలిచింది.
మ్యాచ్ మధ్యలో ‘హిండ్రన్స్’ (అరుపులు) కారణంగా అంపైర్ సబలెంకకు ఒక పాయింట్ పెనాల్టీ విధించడం చర్చనీయాంశమైంది.
