
DNews: Mar 09: తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా వేమ్ నరేంద్ర రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. కాంగ్రెస్ తరఫున ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలను తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో సమర్పించారు. మరో స్వతంత్ర అభ్యర్థి సాయి కూడా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరించబడింది. ఇతర అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో, కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎన్నికైన అభ్యర్థులకు సంబంధిత ధ్రువపత్రాలను త్వరలో అందజేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
