
DNews: Jan 29: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అర్హత రద్దు పిటిషన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ ఈ నెల 30న విచారణ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన నాగేందర్, తాను పదవుల కోసం ఎక్కడా వెళ్లలేదని, కానీ పట్టించుకోకపోవడంతో వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. “నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు నన్ను అండగా నిలుస్తారు. నా నిర్ణయాలు ప్రజల ఆధారంగా ఉంటాయి. ప్రజల ఆశీర్వాదంతోనే నేను ఆరు సార్లు గెలిచాను. ఖైరతాబాద్ ప్రజలే నా బలం. సేవ చేయాలనే ఉద్దేశ్యం తప్ప నాకు పదవులపై ఎప్పుడూ ఆశ లేదు. నేను ఉన్నంతవరకు పోరాడుతాను” అని వ్యాఖ్యానించారు. స్పీకర్ నోటీసులు తనకు అందలేదని, పిటిషనర్‌కు అంది ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతం చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నానని, స్పీకర్ అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇస్తానని నాగేందర్ స్పష్టం చేశారు.
