అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు తన కెరీర్‌లో కీలక విజయాన్ని అందుకున్నారు. ఇటీవల వచ్చిన గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘లెనిన్’ తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో వచ్చిన సినిమాల్లో ఇదే తొలి భారీ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు తన కెరీర్‌లో కీలక విజయాన్ని అందుకున్నారు. ఇటీవల వచ్చిన గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘లెనిన్’ తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో వచ్చిన సినిమాల్లో ఇదే తొలి భారీ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. చాలా కాలంగా అఖిల్‌కు సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘లెనిన్’ విజయం భారీ రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో అఖిల్ తదుపరి ప్రాజెక్ట్‌పై సహజంగానే ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖిల్ నెక్ట్స్ మూవీకి సంబంధించి పలు రకాల వార్తలు, రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

అఖిల్ తదుపరి సినిమాకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఫైనల్ అయ్యాయని, పలువురు దర్శకులతో ఆయన చర్చలు జరుపుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అఖిల్ టీమ్ స్పష్టం చేసింది. ఈ మేరకు అఖిల్ అక్కినేని టీమ్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అఖిల్ తన తదుపరి సినిమాను ఇంకా ఏదీ సైన్ చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఎలాంటి వార్తలను నమ్మవద్దని, వాటిని మరింతగా ప్రచారం చేయవద్దని అభిమానులు, మీడియాను కోరింది. అఖిల్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన టీమ్ తెలిపింది. దీంతో ప్రస్తుతం అఖిల్ నెక్ట్స్ మూవీపై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమైంది

By Ramya