D News: Jul 27: తెలంగాణ శాసనసభ: తెలంగాణ రాజకీయం వేగంగా మారుతున్న సమీకరణాలతో అత్యంత ఆసక్తికరంగా మారింది. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, యువత ఉద్యమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అనూహ్య ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.

చట్టసభలకు (అసెంబ్లీ, లోక్‌సభ) పోటీ చేసే అభ్యర్థుల కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యువ శక్తికి రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని కోరుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపనున్నారు.

ఆగస్ట్ 17 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఆగస్ట్ 17 నుంచి కనీసం వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ సెంట్రల్ హాల్‌తో పాటు మంత్రుల చాంబర్ల పునర్నిర్మాణ పనులను ఆగస్ట్ 10లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా ఆధునీకరించిన భవన సముదాయాలను రేవంత్ రెడ్డి ఆగస్ట్ నెలలోనే ప్రారంభించనున్నారు. ఈ సమావేశాల్లో వయోపరిమితి తీర్మానంతో పాటు మరికొన్ని కీలక బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

తెలంగాణ శాసనసభ: KCR కౌంటర్ స్కెచ్ ఏంటి?
ఢిల్లీలో యువత నిరసనలకు కాంగ్రెస్ మద్దతు తెలపడం, హైదరాబాద్ వేదికగా బిఆర్ఎస్ ఆందోళనలు చేపట్టడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. యువతను ఆకట్టుకోవడానికి సీఎం రేవంత్ వేస్తున్న ఈ సంచలన పావులకు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మరియు బిఆర్ఎస్ వర్గాలు ఎలాంటి కౌంటర్ వ్యూహాన్ని అమలు చేస్తాయనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana