DNews: Mar 09: ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞం బోర్డు భూముల నుంచి నిరాశ్రయులైన ప్రజలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారధన్ మరియు మరికొంతమంది నిరాశ్రయులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం జరిగిన ర్యాలీలో కవిత, నిరాశ్రయులతో కలిసి ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం జెడ్పీ సెంటర్ వద్ద నిరాశ్రయులు తమ సమస్యకు పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు. వాహనాలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుంటూ కవిత, విశారధన్ మరియు మరికొంతమందిని అరెస్టు చేశారు. అనంతరం కవితను నెలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనల కారణంగా ఖమ్మం జెడ్పీ సెంటర్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే చర్యలు చేపట్టారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana