
DSports:25 OCT:సిడ్నీ: గాయం నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారత జట్టుతో జరగబోయే టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మ్యాక్స్‌వెల్‌తో పాటు, 20 ఏళ్ల యువ పేసర్ మాలీ బీర్డ్‌మన్‌కు సెలెక్టర్లు జాతీయ జట్టులో అవకాశం కల్పించారు.
గతేడాది అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడైన బీర్డ్‌మన్, భారత్‌తో జరిగిన ఫైనల్లో మూడు కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. లిస్ట్-ఏ, బిగ్ బాష్ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో నేషనల్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు.
ఈ నెల 29న కాన్‌బెరాలో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మ్యాక్స్‌వెల్, బీర్డ్‌మన్ చివరి మూడు టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తొలి రెండు టీ20లకు మాత్రమే ఆడనున్నాడు , సీన్ అబాట్ మొదటి మూడు టీ20లకు అందుబాటులో ఉంటాడు.
చివరి వన్డే కోసం మార్పులు శనివారం భారత్‌తో జరిగే చివరి వన్డే కోసం ఆస్ట్రేలియా జట్టులో తాత్కాలిక మార్పులు చేశారు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్, స్పిన్నర్ మాట్ కునెమాన్లను జట్టులోకి చేర్చారు. కీపర్ జోష్ ఇంగ్లిస్ కూడా జట్టులో చేరనున్నాడు. కాగా, షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో ఆడేందుకు మార్నస్ లబుషేన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు.
