DNews:10 OCT:హైదరాబాద్, అక్టోబర్‌ 10: కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికు చెందిన అబ్దుల్లాపూర్ మెట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ జరిగింది. కాలేజీ లాకర్స్‌ను విరగదెరచి దొంగలు కోటికి పైగా నగదు దోచుకెళ్లినట్లు సమాచారం.

వివరాల ప్రకారం, మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన డబ్బులను నిర్వాహకులు ఒకే చోట సేఫ్ లాకర్స్‌లో ఉంచారు. ఈ లాకర్స్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు వాటిని బ్రేక్ చేసి డబ్బుతో పాటు, 200 సీసీ కెమెరాల డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు, తద్వారా తమ కదలికల ఆధారాలు దాచేశారు.

దొంగతనం బయటపడడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బ్రిలియంట్ కాలేజీని పరిశీలించారు.

ప్రాథమిక విచారణలో, ఒక్క దొంగే ఈ దోపిడీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కాలేజీ పరిసరాల్లోని ఇతర సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగల కోసం ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

👉పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “అనుమానాస్పదంగా ఎవరైనా కదులుతున్నట్లు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి” అని సూచించారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana