D Spiritual: Nov 23: తుర్కయంజాల్: కొబ్బరికాయలో శివలింగాకారం.. ఆశ్చర్యానికి గురైన భక్తులు!

కార్తీక మాసం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న వేళ ఓ ఆసక్తికర ఘటన భక్తుల దృష్టిని ఆకర్షించింది. తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని నీలం సంజీవరెడ్డి నగర్ కాలనీలో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆలయంలో ఓ భక్తుడు స్వామివారికి కొబ్బరికాయ కొట్టగా, అందులో శివలింగాన్ని పోలిన ఆకారం కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని గమనించిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొబ్బరికాయలో కనిపించిన శివలింగాకారాన్ని భక్తితో పూజిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే కాలనీలోని పలువురు భక్తులు ఆలయానికి చేరుకుని ఆ ఆకారాన్ని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో, కార్తీక పౌర్ణమికి ముందు రోజు ఇలా శివలింగాన్ని పోలిన ఆకారం కనిపించడం శుభసూచకమని పలువురు భక్తులు విశ్వసిస్తున్నారు.

ఈ ఘటనతో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కొబ్బరికాయలో శివలింగాకారం కనిపించిందన్న విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆసక్తికర ఘటనను చూసేందుకు మరింత మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్మటి వెంకట్ రెడ్డి, గోదాస్ భద్రయ్య, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో చోటుచేసుకున్న ఈ ఘటన భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని, భక్తిభావాన్ని కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *