
D Spiritual: Nov 21: కొండగట్టు చందనోత్సవంలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరు
కొండగట్టు: చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న చందనోత్సవం, పశు సంప్రోక్షణ, నిజరూప దర్శన మహోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎల్లమ్మ కార్పొరేషన్ చైర్మన్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగరావులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం వారు స్వామివారి చందనోత్సవం, పశు సంప్రోక్షణ, నిజరూప దర్శన మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
