D Spiritual: Nov 21: తిరువనంతపురం: మండల-మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు అయ్యప్ప భక్తుల రాక భారీగా కొనసాగుతోంది. శనివారం సన్నిధానం, పంబ పరిసర ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శన అవకాశం కల్పించేందుకు రోజువారీ కోటాకు అదనంగా మరో 5 వేల క్యూ స్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే, శబరిమల అయ్యప్ప స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి అని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ముందస్తుగా వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *