
D Spiritual: Nov 21: హైదరాబాద్: పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా భక్తులు నియమ నిష్ఠలతో శివ దీక్షను స్వీకరిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు సైతం శివమాల ధరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు శివ దీక్షను స్వీకరించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివమాల ధరించిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
శివమాలతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ స్రవంతి భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన ప్రతి విజయంలోనూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోజు శివమాల ధరించే అదృష్టం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఓం నమః శివాయ.. హర హర మహాదేవ.. శంభో శంకరా’ అంటూ తన భక్తిభావాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కార్తీక మాసంలో భక్తులు తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించడం, ఆలయాల్లో అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించడం, పురాణ పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇలాంటి పవిత్ర సమయంలో స్రవంతి చొక్కారపు శివ దీక్ష చేపట్టడంపై అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన వాక్చాతుర్యంతో యాంకర్‌గా గుర్తింపు పొందిన స్రవంతి చొక్కారపు కెరీర్ తొలినాళ్లలో పలు సినిమాల్లోనూ నటించారు. అనంతరం బుల్లితెరపై వివిధ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.
