
D Spiritual: Nov 20: తిరుచానూరు అమ్మవారికి రూ.5 లక్షల విలువైన వెండి స్ఫటిక పాత్ర విరాళం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ బి.శ్రీధర్ వర్మ శుక్రవారం వెండి స్ఫటిక పాత్రను విరాళంగా అందజేశారు. సుమారు 2.850 కేజీల బరువున్న ఈ పాత్ర విలువ రూ.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ వెండి స్ఫటిక పాత్రను అమ్మవారి నిత్య కైంకర్యాల్లో వినియోగించనున్నట్లు అర్చకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు లక్ష్మికాంత్, చలపతి పాల్గొన్నారు.
