D News: Nov 20: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే పసిడిపై రూ.5,120 పతనం!

బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఊరటనిచ్చే వార్త. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావంతో పాటు మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తాజాగా నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.5,120 తగ్గడంతో ధర రూ.1,25,570కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.4,700 తగ్గి రూ.1,15,100 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. కిలో వెండి ధరపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.1.75 లక్షలకు చేరినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

బంగారం, వెండి ధరలు ఒకేసారి భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది. పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *