D Spiritual: Nov 17: భక్తుల జయజయధ్వానాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ బాల్కొండ నియోజకవర్గంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లన్న స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ మహోత్సవానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

అలాగే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సైతం ఉత్సవాలకు హాజరై మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల మధ్య జరిగిన ఈ ప్రతిష్ఠాపన మహోత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *