D Spiritual: Nov 17: స్వర్ణగిరి: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరి దేవస్థానంలో సోమవారం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ, దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు క్షేత్రంలోని స్వామివారి పాదాల చెంత ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు, చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ, గోపికృష్ణల ఆదేశాల మేరకు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విశిష్టతను భక్తులకు వివరించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ఈవో అమర్నాథ్, సీపీఆర్ఓ సాయిబాబా, సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ కొబ్బరికాయలు కొట్టి దివ్య విమాన రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి దివ్య విమాన రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు.

గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు, చిన్నపిల్లల తల్లుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *