
D Educt: Nov 11: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2027 పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం (జనరల్, ఒకేషనల్) విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు బోర్డు వెల్లడించింది.
ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 13వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌బోర్డు తెలిపింది.
