
D Spiritual: Nov 11: సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.1.14 లక్షల విలువైన కార్పెట్ల వితరణ
సీతారామచంద్రస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌లోని ఓయాసిస్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ కృష్ణ చైతన్య, హరిత దంపతులు తమ కుమారుడు విశ్రుత్, కుమార్తె యషితతో పాటు స్నేహితుల సహకారంతో రూ.1.14 లక్షల విలువైన రబ్బరు కార్పెట్లను మంగళవారం అందజేశారు.
ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవాల సందర్భంగా కల్యాణ మండపం ప్రాంగణం మొత్తానికి ఈ కార్పెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని దేవస్థానం ఈవో కే. దామోదర్ రావు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి సాయిబాబా ఆలయ కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు, సమాజ సేవకుడు కడాలి నాగరాజు సహకరించారు.
గతంలోనూ డాక్టర్ కృష్ణ చైతన్య, హరిత దంపతులు దేవస్థానానికి కలర్ ప్రింటర్‌తో పాటు రూ.40 వేల విలువైన కార్పెట్లను అందజేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కే. దామోదర్ రావు, ఏఈవో శ్రావణ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానానికి సహకారం అందించిన దాతల సేవలను పలువురు అభినందించారు.
