
D Spiritual: Nov 10: మిర్జాపూర్ శ్రీ మారుతి మందిరంలో హుండీ ఆదాయం రూ.2.59 లక్షలు
మద్నూర్ మండలం మిర్జాపూర్ గ్రామంలోని శ్రీ మారుతి మందిరంలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలోని హుండీలను విప్పి లెక్కించగా మొత్తం రూ.2,59,096 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ఆదాయాన్ని పారదర్శకంగా లెక్కించి నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాములు, జూనియర్ సహాయకులు కులకర్ణి వేణు, రికార్డు సహాయకురాలు కల్పన కులకర్ణి, అర్చకులు అరవింద్ జోషి, విజయ్ కుమార్, శైలేంద్ర జోషి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ధూపదీప నైవేద్య ఆలయాల అర్చకులు సైతం హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
