
Hanuman Ansh: థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నీమ్ కరోలీ బాబా జీవితంలోని ఆధ్యాత్మిక ఘట్టాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Hanuman Ansh OTT Release: థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణతో సంచలనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ కానుంది. దీంతో రెండు భాషల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇంటి వద్దే వీక్షించే అవకాశం కలగనుంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయినవారు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రూ.440 కోట్లకు పైగా వసూళ్లు..
చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసింది. భారీ ప్రచారం, స్టార్ హీరోల మద్దతు లేకుండానే ప్రేక్షకుల ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా రూ.440 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భక్తి, ఆధ్యాత్మికతతో పాటు జీవిత విలువలను చాటిచెప్పే కథనం సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితంలోని సంఘటనలు, ఆధ్యాత్మిక విశేషాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డాక్టర్ విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమా తక్కువ బడ్జెట్‌లోనే నిర్మితమైంది. భక్తి, ఆధ్యాత్మికత, భావోద్వేగాలను మేళవిస్తూ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించింది.
ఇప్పటికే థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి స్పందన సొంతం చేసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో హిందీ, తెలుగు భాషల్లో అందుబాటులోకి రానుండటంతో డిజిటల్ ప్రేక్షకుల్లోనూ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
