
తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, వినాయక లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తుంది. తాజాగా రాజేంద్రనగర్లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్ర సృష్టించింది.
వినాయక చవితి ఉత్సవాలు అంటేనే ముందుగా ముంబై తరువాత అందరికీ గుర్తుకు వచ్చేది మన భాగ్యనగరమే. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణనాధుడు, బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట. తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, వినాయక లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్ధాల చరిత్ర. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డూ వేలం పాటలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్ర సృష్టించింది.
