D Educt: Nov 6: ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయపు పన్ను శాఖలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు శుభవార్త. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 119 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఖాళీల వివరాలు

ఈ నియామకాల్లో భాగంగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 44, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులు 09, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు 66 ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హతలు, వయోపరిమితి

పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

అభ్యర్థుల క్రీడా విజయాలు, ప్రతిభ, ప్రదర్శన, సంబంధిత సర్టిఫికేట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనతో పాటు అవసరమైన నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 10వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *