
D News: Nov 6: అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లు సర్వీసు పొడిగింపు!
అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అగ్నివీరుల్లో అర్హులైన వారికి మరో రెండేళ్లు సేవలు పొడిగించే అవకాశం కల్పించింది. అనంతరం శారీరక సామర్థ్యం, క్రమశిక్షణ, పనితీరు ఆధారంగా రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం సుమారు మూడు లక్షల మంది అగ్నివీరులు సేవలందిస్తున్నారు. త్వరలో సుమారు 18 వేల మంది నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్నారు. పొడిగింపు పొందిన వారికి అదనపు వేతనం, సేవా నిధి ప్రయోజనాలు అందనున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని కొనసాగిస్తూనే ఈ మార్పులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఇదే సమావేశంలో కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సంఖ్యను 779 నుంచి 850కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. కీలక ఖనిజాల ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధన నిల్వ సామర్థ్యం పెంపు, గణాంక వ్యవస్థలో ఏఐ సాంకేతికత వినియోగానికి కూడా నిధులు కేటాయించింది.
