సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘రామాయణం’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలోని విజువల్స్, నటీనటుల అభినయంపై ఆయన ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన పురాణ గాథను అద్భుతంగా వెండితెరపై చూపించారని కొనియాడారు. నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీలతో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు.

మహేష్ బాబు ప్రశంసలతో ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘వారణాసి’ సినిమా కూడా చర్చలోకి వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 20 నిమిషాల పాటు రామాయణ ఘట్టం ఉండనుందని సమాచారం. లుక్ టెస్ట్‌లో మహేష్‌ను రాముడి గెటప్‌లో చూసి ఆశ్చర్యపోయానని గతంలో రాజమౌళి వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

‘రామాయణం’లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా ఆకట్టుకోవడంతో.. ‘వారణాసి’లో మహేష్ బాబు రాముడిగా ఎలా కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఈ ఇద్దరు స్టార్ హీరోల రాముడి పాత్రలపై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *