D Educt: Nov 6: CBSE 2027: పదో, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో, పన్నెండో తరగతుల ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ల షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలతో పాటు పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా వెల్లడించింది.

ప్రాక్టికల్ పరీక్షల తేదీలు

సీబీఎస్‌ఈ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పదో, పన్నెండో తరగతుల ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్లు 2026 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ప్రాక్టికల్ పరీక్షలకు ముందుగానే సిద్ధం కావాలని సూచిస్తున్నారు.

పాఠశాలలకు కీలక ఆదేశాలు

ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి సీబీఎస్‌ఈ పాఠశాలలకు పలు సూచనలు జారీ చేసింది. అధికారిక ఆన్‌లైన్ జాబితా (List of Candidates)లో పేర్లు నమోదైన విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతించాలని స్పష్టం చేసింది. అలాగే పదో తరగతి ఇంటర్నల్ మార్కుల ప్రక్రియను ఒకే విడతలో పూర్తి చేయాలని ఆదేశించింది.

విద్యార్థులకు సంబంధించిన మార్కులను ఎప్పటికప్పుడు సకాలంలో అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పాఠశాల యాజమాన్యాలకు బోర్డు సూచించింది. ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులోగా పరీక్షలు, మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *