D Educt: Nov 5: ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాలకు నవంబరు 19 వరకు అవకాశం

ఎనిమిదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందించేందుకు నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ (NMMS) పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. నవంబరు 4న ఈ కీని ప్రభుత్వ పరీక్షల విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రాథమిక ఆన్సర్‌ కీని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.inలో పరిశీలించుకోవచ్చని డైరెక్టర్‌ లింగయ్య తెలిపారు. కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబరు 19వ తేదీలోపు పంపించాలని నవంబరు 4న విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరారు.

నవంబరు 1న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 37,403 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 35,580 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు ప్రాథమిక కీని పరిశీలించి, తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *