D Educt: Nov 5: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2026 టియర్‌-1 తాత్కాలిక ఆన్సర్‌ కీలు విడుదల

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ (CGL) 2026 టియర్‌-1 పరీక్షకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్‌ కీలు (Tentative Answer Keys), రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 28 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్‌ కావాలి. అనంతరం రెస్పాన్స్‌ షీట్లు, తాత్కాలిక ఆన్సర్‌ కీలను పరిశీలించుకోవచ్చు.

తాత్కాలిక ఆన్సర్‌ కీలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఒక్కో అభ్యంతరానికి రూ.50 చొప్పున రుసుము చెల్లించి, నవంబరు 7వ తేదీలోపు అభ్యంతరాలను నమోదు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *