
D News: Nov 4: రైల్వేలో 3,548 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నవంబరు 6తో ముగియనున్న దరఖాస్తుల గడువు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) గత నెలలో విడుదల చేసిన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పోస్టుల నోటిఫికేషన్ (CEN No.06/2026)కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నవంబరు 6తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 56 ఖాళీలు ఉన్నాయి.
డిగ్రీ అర్హతతో పలు పోస్టులు
ఈ నియామకాల్లో భాగంగా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు పలు ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
నవంబరు 6 చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు నవంబరు 6లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసక్తి గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
