: Virat Kohli Stuns Everyone with a One-Handed Diving Catch Against New Zealand; Video Goes Viral!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ నాథన్ స్మిత్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను స్లిప్స్‌లో కోహ్లీ ఒంటి చేత్తో అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 28.3వ ఓవర్‌లో అన్షుల్ కాంబోజ్ ఫుల్ లెంగ్త్ బంతిని సంధించాడు. ఆ బంతిని డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించిన నాథన్ స్మిత్ బ్యాట్‌కు తగిలిన బంతి స్లిప్స్ వైపు వెళ్లింది. దీంతో రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కుడివైపు డైవ్ చేస్తూ గాల్లోకి దూసుకెళ్లిన బంతిని ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు.

క్యాచ్ పట్టిన వెంటనే కోహ్లీ తనదైన శైలిలో ఆర్చరీ సెలబ్రేషన్‌తో సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ ఫీల్డింగ్ నైపుణ్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మైదానంలో అతడి చురుకుదనం, అంకితభావం మరోసారి స్పష్టమయ్యాయని ప్రశంసిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి తడబడింది. తాజా సమాచారం ప్రకారం 38 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫర్ట్ 38, గ్లెన్ ఫిలిప్స్ 30, డారిల్ మిచెల్ 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ చెరో రెండు వికెట్లు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *