D Spiritual: Oct 21: శబరిమల గదుల బుకింగ్‌లో కొత్త నిబంధనలు.. దళారులకు చెక్‌!

శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి సదుపాయాలను మరింత పారదర్శకంగా అందించేందుకు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా శబరిమలలో గదుల బుకింగ్‌కు కొత్త నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం టికెట్‌ బుక్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే వసతి గదులు కేటాయించేలా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది.

దళారులకు చెక్‌ పెట్టేందుకు ఓటీపీ విధానం

శబరిమలలో గదుల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, దళారులు భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏజెన్సీలు, దళారుల జోక్యాన్ని అరికట్టేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే నిజమైన భక్తులకు వసతి గదులు కేటాయించడంలో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.

కేరళ హైకోర్టుకు విజిలెన్స్‌ నివేదిక

గదుల కేటాయింపులో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై దేవస్వం విజిలెన్స్‌ విభాగం ఇప్పటికే విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన అనంతరం దేవస్వం కమిషనర్‌ కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి లభించిన తర్వాత కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana