
D Educt: Oct 17: ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు!
ఇంజినీరింగ్ విద్యార్హత ఉన్న యువతకు రెండు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కల్పించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని మేకాన్ లిమిటెడ్ (MECON) సంస్థలు మొత్తం 309 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.
HALలో 150 పోస్టులు, MECONలో 159 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువు అక్టోబర్ 17తో ముగియనుంది.
ఈ నియామకాల్లో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత సంస్థల అధికారిక నోటిఫికేషన్లలో పరిశీలించాలి.
