Ramayana Part 1: Special Screening Planned at Rashtrapati Bhavan Ahead of Release?

D News : బాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలున్న పౌరాణిక చిత్రాల్లో ‘రామాయణ: పార్ట్ 1’ ఒకటి. దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది.

రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన?

‘రామాయణ: పార్ట్ 1’ విడుదల రోజున ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవితో పాటు దర్శకుడు నితీశ్ తివారీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రత్యేక ప్రదర్శనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఢిల్లీ, ముంబైలో గ్రాండ్ ప్రీమియర్లు

రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శనతో పాటు ఢిల్లీలో మరో ప్రీమియర్, ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC)లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరపైకి తీసుకురావడమే లక్ష్యంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ తారాగణం, ప్రతిష్టాత్మక నిర్మాణం కారణంగా ‘రామాయణ’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

విడుదలకు ముందే ప్రత్యేక ప్రదర్శనలు, గ్రాండ్ ప్రీమియర్ల గురించి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాల వివరాలు అధికారికంగా వెల్లడైతేనే పూర్తి స్పష్టత రానుంది.

By Avinash