D Educt: Sept 30: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 683 పీఎం శ్రీ స్కూళ్లలో ప్రత్యేకావసరాల పిల్లలకు బోధించేందుకు 683 మంది స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటెడ్ టీచర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ప్రతి పీఎం శ్రీ పాఠశాలకు ఒక టీచర్‌ను కేటాయించనున్నారు.

ఈ టీచర్లు నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు మాత్రమే విధులు నిర్వహించనున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు.

ఎంపికైన వారికి నెలకు రూ.16,500 చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ఈ నియామకాల కోసం మొత్తం రూ.5.63 కోట్లను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.