D Educt: Sept 29: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో ఆరో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే, ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆరో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఎస్‌ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థుల విద్యాభ్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

విద్యాసంవత్సరం ఇప్పటికే కొనసాగుతున్న సమయంలో అకస్మాత్తుగా భాషా విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉందని కోర్టు ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని త్రిభాషా విధానం అమలుపై సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలను వెలువరించింది.