
D NEWS: RTC క్రాస్‌రోడ్స్‌లోని తెలంగాణ స్టేట్ ఆయిల్‌ఫెడ్ భూమికి సంబంధించిన GO 85ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
సుమారు 17 వేల చదరపు గజాల భూమిని GO 366 ఆధారంగా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మార్కెట్ విలువ సుమారు రూ.500 కోట్లుగా ఉంటే, కేవలం రూ.80 కోట్లకే భూమిని అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన Oilfed భూమిని, పామ్ ఆయిల్ స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. సుప్రీంకోర్టు 1987లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ భూమి ప్రభుత్వ ఆస్తిగా గుర్తించబడిందని శ్రవణ్ తెలిపారు.
పామ్ ఆయిల్ సాగును విస్తరించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ Oilfedకు అవసరమైన మరో మూడు మిల్లుల ఏర్పాటు పెండింగ్‌లో ఉందని ఆయన అన్నారు. రైతుల అవసరాలకు ఉపయోగపడాల్సిన భూమిని ఇతర ప్రయోజనాలకు కేటాయించకూడదని డిమాండ్ చేశారు.
GO 85తో పాటు GO 366ను కూడా రద్దు చేసి భూమిని శాశ్వతంగా Oilfed ఆధీనంలోనే ఉంచాలని దాసోజు శ్రవణ్ కోరారు. భూమి కేటాయింపు వల్ల ప్రయోజనం పొందే వ్యక్తులు లేదా సంస్థల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంట్‌తో పాటు న్యాయస్థానాల్లోనూ పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
