
D NEWS: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. అయితే బహదూర్‌గూడ రైతుల భూములను అన్యాయంగా తీసుకుంటే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బుల్లెట్ ట్రైన్ కోసం అవసరమైన భూమిని మాత్రమే తీసుకోవాలని కార్తీక్ రెడ్డి అన్నారు. రైతుల హక్కులను గుర్తించి న్యాయం చేసిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని కోరారు.
బహదూర్‌గూడ రైతులు తమ భూముల హక్కుల కోసం చాలాకాలంగా పోరాడుతున్నారని తెలిపారు. అవసరానికి మించి భూములను తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఇతర భూములను వదిలి రైతుల భూములపైనే ఎందుకు దృష్టి పెడుతున్నారని నిలదీశారు.
అభివృద్ధి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తమ నియోజకవర్గానికి మెట్రో రైలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బుల్లెట్ ట్రైన్ కూడా రావాలని కోరుకుంటున్నామని చెప్పారు.
బహదూర్‌గూడ రైతుల సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రైతులు కలిసి తమ సమస్యలను వివరించారు. హైకోర్టును ఆశ్రయించి రైతులకు రిలీఫ్ తీసుకొచ్చామని కార్తీక్ రెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
